America: మోదీకి ట్రంప్ ప్రత్యేక కానుక

అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ట్రంప్ ప్రత్యేక బహుమతి(Special gift) ఇచ్చారు. తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ (Our Journey Together) అనే పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న ప్రధాన ఘట్టాలతో కూడిన ఫొటోబుక్ ఇది. 2019లో మోదీ అమెరికాలో నిర్వహించిన హౌడీ మోదీ (Howdy Modi) , 2020లో ట్రంప్ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ (Namaste Trump) కార్యక్రమాల ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. పుస్తకంపై మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్, యూ ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు.