Donald Trump: ఆటో ఉత్పత్తులపై సుంకాలకు ట్రంప్ విరామం?

ఆటో ఉత్పత్తులపై విధించిన సుంకాలకు కొంత విరామమివ్వాలని ఆలోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. కార్ల (Cars ) కంపెనీలు సరఫరా వ్యవస్థలను మెరుగుపరుచుకోవా డానికి వీలుగా ఈ వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఆయన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కెనడా(Canada) , మెక్సికో (Mexico), ఇతర దేశాల నుంచి ఉత్పత్తిని అమెరికా (America) కు మార్చడానికి కార్ల కంపెనీలకు కొంత సమయం అవసరమన్నారు. ఆటో ఉత్పత్లుపై 25 శాతం సుంకాలు మార్చి 27 నుంచి అమల్లోకి వచ్చాయి.