డొనాల్డ్ ట్రంప్ కోసం 5వేల మంది లాయర్లు .. ఎందుకో తెలుసా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై భారీ అంచనాలతో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఫలితానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ఫలితం వెల్లడి దాకా ప్రతీ దశనూ నిశితంగా పర్యవేక్షించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైనా న్యాయపోరాటం అవసరమైతే తక్షణమే స్పందించేందుకు వీలుగా 5 వేల మంది లాయర్లను రెడీ చేశారని తెలిసింది. 2020 ఎన్నికల్లో ట్రంప్ పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలు రాష్ట్రాల్లో ఆయన న్యాయపోరాటం కూడా చేశారు. కానీ ఆరోపణలకు సరైన ఆధారాలు లేనందున ఆయన అభియోగాలు తిరస్కరణకు గురయ్యాయి. గత అనుభవం దృష్ట్యా ఈసారి మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.






