డొనాల్డ్ ట్రంప్ ను మందలించిన జడ్జి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు విచారణకు హాజరయ్యారు. మన్‌హట్టన్ కోర్టుహౌస్‌లో బోనులో నిలబడి సమాధానాలు ఇచ్చే క్రమంలో జడ్జి అర్థర్ ఎన్గోరాన్ పలుమార్లు ట్రంప్‌ను మందలించారు. ఇది రాజకీయ సభ కాదని గుర్తు చేశారు. ఉపన్యాసాలు కట్టిపెట్టి అడిగిన ప్రశ్నలకు మాత్రమే సంక్షిప్తంగా సమాధానమివ్వాలంటూ పదే పదే సూచించారు. అయినప్పటికీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ కెవిన్ వాలెస్ అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సుదీర్ఘ జవాబులిస్తుండడంతో జడ్జి అసహానాకి గురయ్యారు. ట్రంప్ తన కంపెనీ ఆస్తుల విలువను మోసపూరితంగా అధికంగా చూపి బ్యాంకులు, బీమా కంపెనీలను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.






