ఇది రాజకీయ కుట్ర.. డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ
ఆస్తులపై దొంగ లెక్కలు చెప్పడం ద్వారా బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై న్యూయార్క్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ట్రంప్ హాజరయ్యారు. అటార్నీ జనరల్ లెతీతియా జేమ్స్ వేసిన ఆ కేసులో మోసానికి ట్రంప్ కారణమని న్యాయవాదులు ఆరోపించారు. ట్రంప్ తన ఆదాయ వ్యయ వివరాలను తప్పుగా చూపారు. ఏటికేడు అబద్ధాలను చెబుతూ వచ్చారు అని అటార్నీ కార్యాలయ న్యాయవాది కెవిన్ వాలెస్ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను డిఫెన్స్ న్యాయవాదులతో కలిసి కూర్చున ట్రంప్ ఖండించారు. ఇది రాజకీయ కుట్ర. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఎన్నికల్లో నన్ను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం. దేశ ప్రజలు దీనిని నమ్ముతారని అనుకోవడం లేదు అని ఆయన స్పష్టం చేశారు.






