అమెరికాలో వర్క్ పర్మిట్ దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల ( డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారి వారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. సాధికారంగా డ్రీమర్లుగా గుర్తింపు పొందిన 2,50,000 మందిలో అత్యధికులు భారతీయులే. అమెరికాలో హెచ్ 1బీ వీసా మీద పని చేస్తున్న, అమెరికాలో శాశ్వత వీసా కోసం ఐ`140 అనుతులు పొందిన విదేశీయులు పిల్లలు బాల్యంలోనే తల్లిదండ్రుల వెంట అమెరికాకు వస్తారు. తల్లిదండ్రులు శాశ్వత పౌరసత్వమిచ్చే గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉంది. ఈలోపు వారి పిల్లలకు 21 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. వారిని తిప్పి పంపకుండా అమెరికాలో ఉంచడానికి 2023లో పాలక ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లో బాలల చట్టాన్ని ప్రతిపాదించాయి.






