US Citizen ship: సిటిజన్ షిప్ కోసం.. కడుపు’కోత’లా..?

ట్రంప్ అధికారంలోకి వస్తూనే బర్త్ సిటిజన్ షిప్ రద్దు చేశారు. ఒక్క కలం పోటుతో క్యాన్సిల్ అన్నారు. అయితే .. ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాటిక్ పార్టీ మండిపడుతోంది. ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఫెడరల్ కోర్టు .. తాత్కాలికంగా ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేసింది. కానీ.. ఈ నిర్ణయం.. వలస వచ్చిన కుటుంబాలపై పెను బాంబ్ పేల్చింది.ఇన్నాళ్లుగా సిటిజన్ షిప్ కోసం కాచుక్కూర్చున్న వారంతా హతాశులయ్యారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
ఫిబ్రవరి 20లోగా అమెరికా గడ్డపై జన్మించిన వారికి మాత్రమే బర్త్ సిటిజన్ షిప్ ఉంటుందంటున్నారు. మరి.. ఆ తర్వాత పుడితే వారు పరాయివారవుతారు. ఇక్కడ చదివినా.. 21 ఏళ్లు వచ్చిన తర్వాత స్వదేశానికి పోవాల్సిందే. ఇన్నాళ్లు ఇక్కడ చదివినవారికి.. తర్వాత ఎక్కడో బతకాలంటే ఎలా..? పోనీ ఇక్కడే ఉందామంటే అమెరికా పౌరుడు కానప్పుడు.. ఇక్కడి సంక్షేమపథకాలు వర్తించవు. దీంతో బతుకు భారమవుతుంది.
దీంతో, ట్రంప్ ఇచ్చిన గడువు లోపే పిల్లల్ని కనేందుకు చాలామంది భారతీయ జంటలు ఇప్పుడు సిజేరియన్లు (C-section) వైపు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి 20లోపు తమకు పిల్లలు పుట్టాలని ఈ మేరకు సిజేరియన్ చేయాలంటూ చాలామంది భారతీయ మహిళలు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలా హాస్పిటల్ కు వచ్చే భారతీయ మహిళల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది.
ప్రస్తుతం 8వ నెలతో ఉన్న ఎంతోమంది భారతీయ గర్భిణులు(Pregnants) తమకు సిజేరియన్ చేయాల్సిందిగా హాస్పిటల్ లో అంగీకార పత్రాలిస్తున్నారు. 7 నెలల గర్భంతో ఉన్నవాళ్లు కూడా హాస్పిటల్స్ కు రావడం ఎక్కువైందంటున్నారు వైద్యులు.ఇలా ముందుగానే పిల్లలకు జన్మనిస్తే, వాళ్లలో ఊపిరితిత్తుల సమస్యలు, ఫీడింగ్ సమస్యలు, తక్కువ బరువు సమస్యలు తలెత్తుతాయని వైద్యులు కాబోయే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
హెచ్1బీ, ఎల్1 వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయుల(Indians) సంఖ్య లక్షల్లో ఉంది. ఇన్నాళ్లూ వాళ్లు బర్త్ రైట్ సిటిజన్ షిప్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్లంతా స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి రావాలి లేదా యుఎస్‌ఏలో ఉండటానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. 1868 లో జన్మతః పౌరసత్వాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో 14 మిలియన్ల మధ్య చట్టవిరుద్ధంగా నివశిస్తున్నారు. వాళ్లకు పిల్లలు పుడితే, ఆటోమేటిగ్గా వీళ్లంతా అమెరికన్ పౌరులుగా మారిపోతారు. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.