కరోనా పుట్టుకకు ఫౌచీయే బాధ్యుడు… వెంటనే తొలగించండి : మార్జోరీ టేలర్

కరోనా మహమ్మారి మానవ తప్పిదమే అనే వాదన ఇటీవలి కాలంలో బలం పుంజుకుంటోంది. ఈ క్రమంలో ఈ వైరస్ తయారీకి అమెరికా కూడా నిధులు సమకూర్చినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనికితోడు ఇలాంటి కొత్త వైరసులు సృష్టించడానికి చైనాలోని వూహాన్ ల్యాబ్‌కు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథనీ ఫౌచీ ఆధ్వర్యంలోనే నిధులు అందినట్లు చాలా వార్తలు వెలుగు చూశాయి. దీంతో చాలా మంది ఫౌచీపై మండిపడ్డారు. వైరస్ సహజంగా తయారైందని గతంలో ఫౌచీ చెప్పిన మాటలను అబద్ధాలంటూ వారందరూ కొట్టి పారేశారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన రిపబ్లికన్ రిప్రజంటేటివ్ మార్జోరీ టేలర్ గ్రీన్ మాత్రం ఫౌచీపై మండిపడ్డారు. కరోనా వైరస్‌ను తయారు చేసి ఇలా అమెరికా ప్రజలను కష్టాలపాలు చేసినందుకు ఫౌచీనే బాధ్యుడని ఆరోపించిన ఆమె.. ఫౌచీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమెతోపాటు మరికొందరు రిపబ్లికన్ అభ్యర్థులు కూడా ఈ వాదనకు మద్దతుగా నిలిచారు. తమ సెనేట్‌లో ఫౌచీ జీతాన్ని జీరో చేసేస్తున్నామని, ఆయనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వబోమని స్పష్టం చేసిన ఆమె.. సెనేట్ కూడా ఇదే పని చేసి, వెంటనే ఫౌచీ స్థానాన్ని వేరే వారితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.