డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసన అట్టర్ ఫ్లాప్
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా ఎలాగైనా పదవిని పట్టుకుని వేలాడాలనుకున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అధ్యక్ష పదవిలో ఉండేందుకు అడ్డదారులు తొక్కి ప్రపంచంలోనే అతి పురాతమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న అమెరికాను అభాసుపాలయ్యేలా చేశాడు. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియా బహిష్కరించింది. ఈ క్రమంలోనే మొన్న ట్విట్టర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. అయితే ఈ ఖాతా తొలగింపుపై కూడా ట్రంప్ మద్దతుదారులు బీభత్సవం చేయాలని భావించారు. కానీ వారు చేయాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం అట్టర్ ఫ్లాపయ్యింది.
క్యాపిటల్ హౌస్‌పై దాడిని ప్రేరేపించారని తెలియడంతో 88 మిలియన్ల మంది ఫాలోయింగ్ ఉన్న ట్రంప్ ఖాతాను నిలిపివేసిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం (జనవరి 11) ట్రంప్ మద్దతుదారులు, అభిమానులు ఆందోళన చేయాలని సిద్ధమయ్యారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అక్కడి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని ట్రంప్ అభిమానులు డిమాండ్‌పై నిరసనకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. పోలీస్ బందోబస్తు చూసి చాలామంది భయపడి విరమించుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.






