అధికార బదిలీ పక్రియ షురూ ..శ్వేతసౌధం
ఎన్నికల ఓటమని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం అధికార బదిలీ పక్రియను ప్రారంభించింది. అధికార బదిలీకి చట్ట ప్రకారం చేయాల్సిన పనులను చేస్తున్నామని శ్వేతసౌధంలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ట్రంప్ అధికార యంత్రాంగం ప్రకటించింది. శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ క్యాలీ మెక్ ఎనానీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వాదనను సమర్థించారు. బిడెన్ గెలిచినట్టు ఆమె ఇంకా గుర్తించలేదు. అధ్యక్షుడు ట్రంప్ చాలా సృష్టతతో ఉన్నారు. చట్టబద్దమైన ప్రతి ఒక్క ఓటునూ లెక్కించాలని కోరుతున్నారు. ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఓట్లు లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష మార్పిడి చట్టం (ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ యాక్ట్) ప్రకారం పాటించాల్సిన పక్రియను మొదలుపెట్టామని అన్నారు. అధికార యంత్రాంగం తరపున చేయాల్సిన పనులను చేస్తున్నామని చెప్పారు.






