చైనాపై అమెరికా విదేశాంగ మంత్రి విమర్శలు …
కొవిడ్ 19 వైరస్ పుట్టుక, వ్యాప్తిని గుర్తించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దర్యాప్తును చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) అడ్డుకుంటుందని అమెరికా విదేశాంగ శాఖ మత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ప్రపంచం మొదటిసారిగా విస్పోటనం గురించి తెలుసుకున్న దాదాపు సంవత్సరం తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వైద్య పరీక్షల ఫలితాలకు సంబంధించి పారదర్శకత, జవాబుదారీతనం.. ప్రాథమిక నిర్లక్ష్యం కారణంగా టీకాల పంపిణీపై భద్రత, సమర్థతపై అవసరమైన డేటా లేకపోవడం వంటి ఈ రెండు చర్యలతో చైనా పౌరులను, ప్రపంచాన్ని ప్రమాదంలో పడేయబోతోందని ఆరోపించారు. వైరస్ ప్రమాదాల గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలను, వైద్యులు, పాత్రికేయులను సీసీపీ శిక్షించిందని, ఇది నియంత్రించదగిన వ్యాప్తి.. ప్రపంచ మహమ్మారిగా మారడానికి అనుమతించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకగా, మహమ్మారి వ్యాప్తిలో చైనా పాత్ర ఉందని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.






