థాంక్స్ గివింగ్ డిన్నర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ థాంక్స్ గివింగ్ డిన్నర్ ఇచ్చారు. ఫ్లోరిడాలోని తన నివాసం మారలాగోలో దీనిని నిర్వహించారు. భారీ స్థాయిలో ఇచ్చిన ఈ విందుకు కుటుంబ సభ్యులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వారిలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఆయన ట్రంప్ కుటుంబంతో కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడి చిన్న కుమారుడు బారన్ ట్రంప్, మస్క్ కొద్ది సేపు సరదాగా ముచ్చటించుకున్నారు. వాటిపై మస్క్ స్పందించారు. అప్రమత్తత, వీడియో గేమ్స్ గురించి బారన్తో చర్చించానని తెలిపారు. ఎలాన్ తల్లి మయే మస్క్ కూడా ఆ డిన్నర్లో పాల్గొన్నారు. వారిద్దరు రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. బారన్ చాలా స్మార్ట్ అని ప్రశంసించారు.






