డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా.. కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అధికార డెమోక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖారారైంది. 59 ఏళ్ల కమల భారత, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు. ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన ఓట్లను వర్చువల్ రోల్ కాల్లో పార్టీ ప్రతినిధుల నుంచి ఆమె పొందారు. డెమోక్రాట్ల అభ్యర్థిగా అధికారికంగా ఖరారవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కమల తెలిపారు. తన నామినేషన్‌ను వచ్చే వారం స్వీకరిస్తారనని చెప్పారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె అమీతుమీ తేల్చుకోనున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచైనా, డెమోక్రాటిక్ పార్టీ తరపునైనా ఓ భారతీయ అమెరికన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతుండటం ఇదే తొలిసారి.






