ప్రచారంలో కమలా హారిస్ దూకుడు
అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్ల నుంచి విశేషణ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతుండగా, ప్రచార పర్వంలో తాజాగా 3.60 లక్షల మంది వాలంటీర్లు చేరడం విశేషం. కమలా హారిస్ ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజురోజుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఒక వారంలోనే 200 మిలియన్ల డాలర్ల విరాళాలు సేకరించాం. అయితే ఇందులో మూడిరట రెండు వంతుల విరాళాలు కొత్త మద్దతుదారుల నుంచే అందాయి. ప్రచార పర్వంలో తాజాగా 3.60 లక్షల మంది భాగమయ్యారు అని హారిస్ ఫర్ ప్రెసిడెంట్ బాటిల్‌గ్రౌండ్ స్టేట్స్ డైరెక్టర్ డాన్ కన్నీఎన్ వెల్లడించారు.






