కమల వల్ల రెండు దేశాల బంధం మరింత బలపడుతుంది
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వల్ల భారత్, అమెరికా మధ్య సంబంధం మరింత బలపడుతుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘమైన ద్వైపాక్షిక సంబంధాన్ని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఎంతో గౌరవిస్తారని ఆమె తెలిపారు. బైడెన్ ఇప్పటికే పలుమార్లు భారత్‌ను సందర్శించారు. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధంపై ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఇరు దేశాల ఈ విజయవంతమైన సంబంధానికి ఆయన చాలా విలువనిస్తారు. మునుముందు కూడా ఇది ఇలాగే కొనసాగుతుందని బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియా–యూఎస్ సంబంధంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా సాకి చెప్పారు. ఇక భారత సంతతికి చెందిన కమా హారిస్ వల్ల ఈ సంబంధం మరింత సుస్థిరం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.






