ప్రచారంలో వెనుకబడినా… ప్రజాబలంతో విజయం సాధిస్తా : కమలా హారిస్
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను వెనుకబడినా ప్రజాబలంతో భారీ విజయం సాధిస్తానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు భవిష్యత్తు నిర్మాణం, దేశ తిరోగమనం అనే రెండు లక్ష్యాల మధ్య జరుగుతున్నట్లుగా అభివర్ణించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా తన ఎంపిక లాంఛనమైన నేపథ్యంలో ఆమె తొలి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ నిష్క్రమించిన తర్వాత హారిస్ బరిలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో పోలిస్తే అమె ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. ఎన్నికలకు సుమారు 4 నెలలే ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తన విధానాలను వెల్లడిస్తూ ఓటర్లను ఆమె ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది.






