డొనాల్డ్ ట్రంప్ సొంత వాదననకు… అనుమతి నిరాకరణ
ఓ సివిల్ మోసం కేసు విచారణలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వీయ ముగింపు వాదనను చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. సంబంధిత కేసు విషయాలకు సంబంధించి ట్రంప్ కట్టుబడి ఉండాలంటూ న్యాయమూర్తి పట్టుబట్టడాన్ని ఆయన తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో విచారణలో ముగింపు వాదనలు వినిపించడానికి ఒకరోజు ముందు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ట్రంప్‌నకు అనుమతిని రద్దు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ అసాధారణంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు సంకేతాలిచ్చారు. ఆ ప్రకారం ఆయన తన న్యాయబృందం వాదనలతోపాటు తాను స్వయంగా తన వాదనల సారాంశాన్ని సమర్పించే అవకాశం ఉంది. ట్రంప్ తన ఆస్తుల మొత్తాన్ని బిలియన్ల డాలర్ల కొద్దీ అధికం చేసి చూపారని, తద్వారా భద్రమైన వ్యాపార రుణాలు, బీమా పొందారన్నది న్యూయార్క్‌లో నమోదైన కేసు. ఇందులో ట్రంప్ ప్రతివాదిగా ఉన్నారు.






