యావత్ ప్రపంచం ఆ దిశగా అడుగులు వేయాలి : బైడెన్
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. చమురు, గ్యాస్ కోసం ప్రభుత్వ భూముల్లో తవ్వకాలను నిలిపి వేయాలనీ, గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 2030 నాటికి రెట్టింపు చేయాలన్నారు. వైట్ హౌస్లో పర్యావరణ దినం అన్న బైడెన్, జాన్ కెర్రీని పర్యావరణ శాఖ అధిపతిగా ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ పక్రియ ఇప్పటికే ఆలస్యమయ్యింది. ఇంక ఎంతమాత్రం ఉపేక్షించరాదు అని బైడెన్ తెలిపారు. మన మొక్కరే చేస్తే సరిపోదు, యావత్ ప్రపంచం ఆ దిశగా ఆడుగులు వేయాలి. దానికి మనమే నాయకత్వం వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్లో ప్రపంచ సదస్సు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చమురు తవ్వకాల కోసం లీజుకిచ్చిన భూములపై తక్షణమే సమీక్షించాలని కోరారు.






