జో బైడెన్ కుమారుడు హంటర్ పై.. నేరాభియోగాలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ పై కాలిఫోర్నియాలో తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. మరోవైపు కుమారుడికి అనుకూలంగా తన తన పలుకుబడిని ఉపయోగించారంటూ ఆయన్ను అభిశంసించాలని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ పావులు కదుపుతోంది. దీనిపై విచారణకు అనుమతించాలన్న తీర్మానంపై వచ్చే వారం అమెరికా పార్లమెంటు దిగువ సభలో ఓటింగ్ జరగనున్నది. సభలో పాలక డెమోక్రటిక్ పార్టీ కన్నా రిపబ్లికన్లకే మెజారిటీ ఉండటం గమనార్హం. జో బైడెన్ లంచాలు తీసుకున్నట్లు కానీ, అధికార దుర్వినియోగానికి, పాల్పడినట్లు కానీ సాక్ష్యాధారాలు లేవు. అయితే, ఆయన కుటుంబ అంతర్జాతీయ వ్యాపారాలపై నైతికపరమైన ప్రశ్నలు తలెత్తాయి. హంటర్‌పై దాఖలైన తొమ్మిది అభియోగాలలో మూడు నేరాభియోగాలు కాగా, ఆరు అక్రమ ప్రవర్తనకు సంబంధించినవి. హంటర్ ఉదంతంపై వ్యాఖ్యానించడానికి అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ నికాకరించింది.






