Trump: ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్
సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు, వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ ( పార్లమెంటు) తిరస్కరించింది. దీంతో అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ నివారణకు ట్రంప్ చేసిన ప్రయత్నం విఫలమైనట్టుయింది. ఈ పరిణామం వల్ల చెందిన పలు ఫెడరల్ సంస్థల కార్యకలాపాలు స్తంభించనున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ (American Congress) (పార్లమెంటు) కొన్ని ఫెడరల్ విభాగాల కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలకు మూడిరట రెండొంతుల మెజారిటీతో సకాలంలో ఆమోదం తెలపని కారణంగా ఈ పరిస్థితి తలెత్తిన విషయం విదితమే. అమెరికా పార్లమెంటులో ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీకి నామమాత్రపు మెజారిటీ ఉంది. షట్‌డౌన్ ప్రభావం సమాఖ్య ప్రభుత్వం చేసే 25 శాతం వ్యయానికే పరిమితమవుతుంది.






