Donald Trump: అమెరికా విద్యావ్యవస్థ లో అనవసర రాజకీయ జోక్యం!

విద్యావ్యవస్థలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు అనవసర రాజకీయ జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా వ్యాప్తంగా 100కు పైగా యూనివర్సిటీలు (Universities), కాలేజీలు (colleges) ఒక సంయుక్త లేఖను విడుదల చేశాయి. గతంలో ఎప్పడూ ఇలా జరుగలేదని ఆ లేఖలో పేర్కొన్నాయి. హార్వర్డ్ (Harvard), ప్రిన్స్‌టన్, బ్రౌన్ (Brown) తదితర ప్రఖ్యాత యూనిర్సిటీల నుంచి చిన్న కాలేజీల వరకు వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు ఆ లేఖపై సంతకాలు చేశారు. క్యాంపస్‌లపై ప్రభుత్వ అనవసర నియంత్రణలను తిరస్కరిస్తున్నామని ఆ లేఖలో తేల్చి చెప్పారు. ఈ పరిణామాలు అమెరికా ఉన్నత విద్యావ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించాయని పేర్కొన్నారు.