డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో.. కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అమెరికాలోని పలు సంస్థలు దీనిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్ / యూగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనుందని తెలిపింది. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు.






