Ukraine :నేను అలా చేస్తే … ఉక్రెయిన్ సేనలు కుప్పకూలుతాయ్

తమ స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే, యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ (Ukraine ) సేనలు కుప్పకూలుతాయని అమెరికా కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) హెచ్చరించారు. ఉక్రెయిన్ సైన్యానికి మా స్టార్ లింక్ (Star Link) వ్యవస్థ వెన్ను దన్నుగా నిలుస్తోంది. ఒకవేళ ఈ ఇంటర్నెట్ (Internet) సేవలను నిలిపేస్తే, రణరంగంలో ఉక్రెయిన్ సేనలు కుప్పకూలతాయి. ఏదేమైనా ఆ దేశానికి ఓటమి అనివార్యం. అయినప్పటికీ, ఏళ్ల తరబడి సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. వాస్తవికతతో ఆలోచించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారు అని మస్క్ పేర్కొన్నారు.