Elon Musk: ట్రంప్ విజయం కోసం.. ఎలాన్ మస్క్ చేసిన ఖర్చు ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఏకంగా రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేశారంటూ ఓ నివేదిక పేర్కొంది. ట్రంప్ తరపున పొలిటిక్ యాక్షన్ కమిటీ (ఏసీ-ప్యాక్) ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. దీనికి గాను మస్క్ (Musk) భారీగా నిధులు అందించారని తెలుస్తోంది. విరాళాలతో పాటు ట్రంప్ (Trump ) కోసం ముమ్మర ప్రచారాలు, సోలో క్యాంపెయిన్ సైతం నిర్వహించారు. ఓటర్లను ట్రంప్‌నకు అనుకూలంగా మార్చేందుకు వాక్ స్వాతంత్య్రం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసిన ఓటర్లకు మస్క్ డబ్బులు పంచినట్లు కథనాలు వెలవడ్డాయి.






