ట్రంప్ విజయం తర్వాత పెద్ద మార్పు : మస్క్
అరుణ గ్రహంపై ప్రయోగాల కోసమే అమెరికా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారంటూ తనపై వచ్చిన విమర్శలకు టెస్లా అధిపతి, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ స్పందించారు. ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ మీరు చెప్పిందంతా నిజమే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఎంతగానో ఉపయోపగపడుతుంది. అంగారకుడిపైకి చేరుకోవడంతో పాటు అక్కడ జీవించేందుకు, ప్రయోగాలు చేసుకునేందుకు వీలవుతుంది. ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత పెద్ద మార్పు కనిపిస్తుందని భావిస్తున్నా. అందుకే రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాను అని తెలిపారు.













