చీటింగ్ కేసులో మన్ హట్టన్ కోర్టుకు మాజీ ప్రెసిడెంట్
అమెరికాలోని న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు హాల్లో ఒక చీటింగ్ కేసు విచారణకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగాలుగా కనిపించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విరుచుపడ్డారు. ఆస్తుల విలువను అధికంగా చేసి చూపించడం ద్వారా ట్రంప్, ఆయన కంపెనీ బ్యాంకులను, భీమా కంపెనీలను మోసగించాయని జేమ్స్ అనే వ్యక్తి కేసు పెట్టారు. అయితే తానెలాంటి తప్పిదానికి పాల్పడలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు తెలిపారు.






