సేవ్ అమెరికా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్
మెక్సికోతో సరిహద్దును కాపాడలేనివారు, ఉక్రెయిన్ సరిహద్దును కాపాడతారా అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టెక్సాస్‌లోని కోన్రీ లో సేవ్ అమెరికా ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ఇతరదేశాలపై దండయాత్ర గురించి మాట్లాడే ముందు అమెరికా సరిహద్దును కాపాడుకోవడం గురించి పట్టించుకోకుండా ఉక్రెయిన్ బోర్డర్‌ను కాపడడం గురించి బైడెన్ ప్రభుత్వం ఎందుకింత హైరానా పడుతుందని ప్రశ్నించారు. ప్రపంచంలో అంతకంటే ముఖ్యమైన సరిహద్దు ఇప్పుడు మనకి ఉక్రెయిన్ బోర్డర్ కాదు, అమెరికా సరిహద్దు అని అన్నారు.
రికార్డు సంఖ్యలో వలసదారులు అమెరికా, మెక్సికో సరిహద్దుకు చేరుకుంటున్నారు. మీరు ఇలా దండెత్తి రావడం అమెరికా భద్రతకే ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. ఇప్పటికే అమెరికా సరిహద్దును బైడెన్ వారికి అప్పగించేశారని, ఈ యుద్ద రంగంలో అమెరికా ఓడిపోవడంతో యావత్ ప్రపంచం అమెరికాలోకే చొరబడుతోంది అని అన్నారు. ఇతర దేశాల దురాక్రమణల గురించి మన నేతలు మాట్లాడే ముందు ఈ దేశంపై దురాక్రమణను నిలువర్సించాల్సి వుందని అన్నారు.






