స్వల్ప ఆధిక్యంలో డొనాల్డ్ ట్రంప్
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై పై చేయి సాధించారు. నవంబరు 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్‌నకే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నాయని తాజా సర్వే తేల్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ 47 శాతం పాయింట్లు సాధించారు. హారిస్ 45 శాతం పాయింట్లతో స్వల్పంగా వెనుకంజ వేశారు. సీఎన్‌బీసీ ఆల్-అమెరికా ఎకనామిక్ సర్వేలో ట్రంప్ 48 శాతం, హారిస్ 46 శాతం పాయింట్లు పొందారు. అటు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్, హారిస్ మధ్య పోరు పోటాపోటీగా ఉండనున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి.






