Iftar Dinner: వైట్ హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రంజాన్ సందర్భంగా వైట్ హౌస్ (Iftar Dinner )లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం (Muslim) వర్గం నేతలు, దౌత్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు (government officials) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ముస్లిం సోదరకులకు రంజాన్ ముబారక్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చారిత్రక అబ్రహాం ఒడంబడికల ప్రాతిపదికగా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు.