Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు తగ్గుతున్న ప్రజాదరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రజాదరణ క్షీణిస్తోంది. వైట్ హౌస్‌లో బాద్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ అఫ్రూవల్ రేటింగ్ (Approval rating ) గణనీయంగా తగ్గి, కనిస్ట స్థాయికి చేరుకున్నది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో కేవలం 42 శాతం మంది అమెరికన్లు ట్రంప్ పరిపాలన విధానాలను సమర్థిస్తున్నట్లు వెల్లడైంది. మూడు వారాల క్రితం 43 శాతంగా ఉన్న ఈ రేటింగ్ జనవరి 20న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నమోదైన 47 శాతం కంటే తగ్గడం గమనార్హం. ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన అమెరికన్లలో రోజురోజుకు పెరుగుతోంది. ఆయన పదవి చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రభుత్వ మంత్రిత్వ (Ministry) శాఖలపైనే కాకుండా విశ్వవిద్యాలయాలు (Universities) వంటి సంస్థలపై కూడా తన పట్టును పెంచుకునే లక్ష్యంతో అనేక కార్యనిర్వాహఖ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యల వల్ల ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని అధిక శాతం మంది భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.