డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం!
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో బహిరంగ ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నరని తెలుస్తోంది. భద్రతాకారణాల దృష్ట్యా ట్రంప్ ప్రచారాన్ని ఇండోర్ ప్రదేశాలకే పరిమితం చేస్తారని ఆయన బృందం వెల్లడించినట్లు సమాచారం. ఒకవేళ బహిరంగ ప్రచారానికి వచ్చినా, రాకపోకల కట్టడికి వీలున్న చిన్నపాటి స్టేడియాల్లోనే ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆయన గతంలో భారీసంఖ్యలో బహిరంగ ప్రచారాలు నిర్వహించారు. వాటికి భారీ మద్దతు లభించింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల ప్రచారం కోసం భారీ సభలు నిర్వహించేందుకు భద్రత కల్పించాలని కోరగా, అందుకు సీక్రెట్ సర్వీస్ నర్వీస్ నిరాకరించినట్లు తెలుస్తోంది.






