ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే… న్యాయమూర్తులను!
అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని సెనెట్‌లోని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డెమోక్రాట్లు ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ అమెరికా డిస్ట్రిక్ కోర్టు జడ్జిగా పెర్రీని నియమించారు. దీంతో పాటు సెనెట్ ఆమోదం కోసం మరో 31 మంది ఎదురుచూస్తున్నారు. అధ్యక్షుడు నామినేట్ చేసిన న్యాయమూర్తులకు సెనెట్ నుంచి ఆమోదం లభిస్తే, వారిని ఆ పదవి నుంచి తొలగించడం వీలుకాదు. ఇది అమెరికా రాజ్యాంగం సెనెట్‌కు కల్పించిన అధికారం. దీనిని ఉపయోగించుకునే డెమోక్రాట్లు తమ పదవిని వీడేలోగా ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలు చేపడుతున్నారు.






