US Congress :అక్రమ వలసదారులను తిప్పి పంపే బిల్లు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్రమ వలసదారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా యూఎస్ కాంగ్రెస్ (US Congress) ఆమోదం తెలిపింది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బిల్లు ఇదేనని అలబామా రిపబ్లికన్ సెనేటర్ కేటీ బ్రిట్ (Katie Britt) అన్నారు. అయితే ఈ బిల్లును ఆమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు.