దేశ ప్రజలకు వార్నింగ్… సాధ్యమైనంత తర్వగా

కరోనా డెల్టా వేరియంట్‍తో అప్రమత్తంగా ఉండాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. వైట్‍హౌస్ వద్ద బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతకమైన ఈ వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ మరింత ప్రభావం చూపించే వీలుంది. ఇది చాలా డేంజరస్. దీని నుంచి తప్పించుకునేందుకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని. ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తుందని, ప్రాణాంతకమైనదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది యువతకు మరింత డేంజరస్ అని అన్నారు. గడిచిన 150 రోజుల్లో 300 మిలియన్ డోసుల టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.