కమలాహారిస్‌కు ఒబామా దంపతుల మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైనట్లే. పార్టీలో మెజారీటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు వ్యక్తమైంది. మీకు మద్దతు ఇచ్చే విషయంలో మిచెల్, నేను ఎంతో గర్వపడుతున్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో మిమ్మిలి ఓవల్ ఆఫీస్‌కు పంపే విషయంలో మేం చేయాల్సిందంతా చేస్తాం అని కమలతో ఒబామా ఫోన్ కాల్లో మాట్లాడారు. మీ విషయంలో గర్వంగా ఉంది. ఇది చరిత్రాత్మకం కానుంది అని మిచెల్ అన్నారు. వారికి వెంటనే హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు.






