Bald Eagle: అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్
అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగ ( బాల్డ్ ఈగల్) (Bald Eagle )ను అధ్యక్షుడు జో బైడెన్ ((Joe Biden) ) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేశారు. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతోంది. 1782 నుంచీ యూఎస్ గ్రేట్ సీల్ (US Great Seal) పై, డాక్యుమెంట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజ ముద్రపైనా ఇది ఉంది. అయినప్పటికీ అధికారికంగా హోదా మాత్రం కల్పించలేదు. తర్వాత అనేకసార్లు దీన్ని మార్చడానికి విఫల యత్నాలు జరిగాయి. తెల్లటి తల, పసుపు పచ్చ ముక్కు, గోధమ రంగు శరీరంతో కూడిన బాల్డ్ ఈగల్‌ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్ (Amy Clouzoucher) డిసెంబర్ 16న సెనేట్‌లో బిల్లు ప్రవేశ పెట్టారు. దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బైడెన్ ఆమోదముద్రతో 240 ఏళ్ల తరవాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా దక్కింది.






