డ్రీమర్స్ కోసం యూఎస్ కాంగ్రెస్ లో.. బిల్లు

అమెరికాలో దీర్ఘకాలిక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై నివసిస్తున్న ప్రవాసుల పిల్లలకు (డ్రీమర్లకు) శాశ్వత నివాసానికి మార్గం సుగమం చేసే బిల్లును ప్రతినిధుల సభలో పార్టీలకతీతంగా ప్రవేశపెట్టారు. చట్టసభ్యురాలు రాజా కృష్ణమూర్తి, డెబోరా రాస్, యంగ్కిమ్, మిల్లర్ మీక్స్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్ 1బీ, ఎల్1, ఈ`1, ఈ2 వీసాదారుల పిల్లలైన ఈ డ్రీమర్లు 21 ఏండ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది. ఇలాంటి వారు 2 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.