Christmas: క్రిస్మస్ సంబరాలకు సిద్ధంకండి! టీఏసీఏ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
TACA: కెనడాలోని తెలుగు వారందరికీ శుభవార్త! తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఈ ఏడాది ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకలకు తెలుగు వారందరికీ స్వాగతం పలుకుతూ ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.
ముఖ్య వివరాలు:
తేదీ: 13వ డిసెంబర్ 2025
సమయం: సాయంత్రం 04:00 గంటల నుండి రాత్రి 08:00 గంటల వరకు
వేదిక (Venue): Paul Palleschi Recreation Centre, 30 Loafers Lake Ln, Brampton, ON L6Z 1X9
ప్రవేశం: ఉచితం (FREE ENTRY)
ఈ వేడుకలకు హాజరయ్యే తెలుగు వారు తప్పనిసరిగా డిసెంబర్ 01, 2025 లోపు రిజిస్ట్రేషన్ (RSVP) చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన ఇమెయిల్: info@teluguassociation.ca
గ్రాండ్ స్పాన్సర్స్:ఈ క్రిస్మస్ వేడుకలకు ICICI Bank, RAM JINNALA (To Buy-Sell-Invest) గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. TACA ఆధ్వర్యంలో జరగనున్న ఈ సంబరాలలో పాల్గొని, క్రిస్మస్ ఉల్లాసాన్ని, ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
- Vishal.B






