Municipal Elections:ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Municipal elections)పై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా (America) నుంచే పాల్గొని సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. అభ్యర్థుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. బీజేపీ (BJP), బీఆరఎస్ (BRS) అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలి. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమే. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలి. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దష్టి పెట్టాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి అని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






