BITS Pilani: అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
ప్రజా రాజధాని అమరావతి (Amaravati)లో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ యూనివర్సిటీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( బిట్స్ పిలానీ) త్వరలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. మందడం, వెంకటపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలో 70.011 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ (CRDA) తో భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మందడం సబ్ రిజిస్ట్రార్ రాంబాబు (Rambabu) సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఏపీ సీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి.డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ తరపున అధీకత ప్రతినిధిగా డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






