Andrea Jeremiah: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న తడాఖా భామ
నటిగా, సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా జరేమియా(Andrea jeremiah). తడాఖా(thadakha) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆండ్రియా ఓ వైపు నటిగా, మరోవైపు సింగర్ గా కెరీర్ లో బిజీగా ఉంది. ఈ ఇయర్ లో ఆండ్రియా నుంచి మూడు నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అయితే కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా ఆండ్రియా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేసే ఆండ్రియా తాజాగా తన వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆండ్రియా సింపుల్ లుక్స్ లో మరింత అందంగా కనిపించింది. ఆ ఫోటోలను చూసి ఆండ్రియా బీచ్ అందాలను కూడా డామినేట్ చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.






