Suhaas: నా లవర్ కు పెళ్లి జరగదు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సుహాస్
సుహాస్(Suhaas) హీరోగా, శివానీ నగరం(Sivani nagaram) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా హే భగవాన్. సీనియర్ యాక్టర్ నరేష్(naresh), స్రవంతి చొక్కారపు(sravanthi chokkarapu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీ అచ్చర(gopi achara) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ హే భగవాన్ టీజర్(Hey Bhagavan teaser) ను లాంచ్ చేస్తూ ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసింది.
ఈ ఈవెంట్ లో సుహాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హే భగవాన్ టీజర్ లాంచ్ పోస్టర్ ను రిలీజ్ చేయగానే, మళ్లీ అలాంటి సినిమానేనా అని తనకు చాలా మెసేజ్లు వచ్చాయని, కానీ ఈ సినిమా అలాంటిది కాదని, హే భగవాన్(Hey bhagavan) తన గత సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సినిమాలో తాను చనిపోనని, తన లవర్ కు వేరే వారితో పెళ్లి జరగదని అన్నాడు.
మరీ ముఖ్యంగా తాను ఈ సినిమాలో పేద వాడిని కాదని కూడా సుహాస్ చెప్పాడు. అంతేకాదు, ఈ మూవీ తన కెరీర్లోనే పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నానని, ఇకపై తాను చేసే సినిమాలన్నీ అందరినీ ఆకట్టుకుంటాయని సుహాస్ అన్నాడు. హే భగవాన్ లో కామెడీ బాగా వర్కవుట్ అయిందని, తనతో పాటూ నరేష్, వెన్నెల కిషోర్(vennela kishore), సుదర్శన్(sudarshan) అందరూ బాగా నవ్విస్తారని చెప్పాడు.






