TAGB: టీఏజీబీ ఉగాది సంబరాలు 2026.. త్వరలో
బోస్టన్ పరిసర ప్రాంత తెలుగు సంఘం (TAGB) ఆధ్వర్యంలో 2026 మార్చి 15వ తేదీన ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రెంతమ్ హైస్కూల్ వేదిక కానుంది.
ముఖ్య సమాచారం
తేదీ: మార్చి 15, 2026
వేదిక: రెంతమ్ హైస్కూల్ (201 Franklin St, Wrentham, MA 02093)
నిర్వాహకులు: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB)
ఈ ఉగాది పండుగ సందర్భంగా ప్రవాస తెలుగు వారందరినీ ఒకే చోట చేర్చి, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను టీఏజీబీ ప్లాన్ చేస్తోంది. తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.






