BATA: అహో అనిపించిన బాటా సంక్రాంతి సంబరాలు
ఆకట్టుకున్న కార్యక్రమాలు…1000 మందికి పైగా హాజరు
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వంటల పోటీలు, రంగవల్లి ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, మధురమైన పాటల పల్లకి సంగీత కార్యక్రమం, శాస్త్రీయ నృత్య ప్రదర్శన, జానపద నృత్యాలు, ప్రముఖ స్టేజ్ గేమ్ షో మరియు ఉత్సాహభరితమైన నృత్యాలు వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై రాత్రి 9:00 గంటల వరకు జరిగిన ఈ వేడుకలకు 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. సంక్రాంతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమం ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. రంగురంగుల గాలిపటాలు, అలంకరణలు, నిర్వాహకులు సాంప్రదాయ దుస్తులు అక్కడకు వచ్చినవారికి పండుగ వాతావరణాన్ని కనిపించేలా చేశాయి.
ఈ వేడుకలకు వచ్చిన వారికి పసందైన విందు భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దాదాపు 40కి పైగా వంటకాలతో కూడిన సంక్రాంతి విందు భోజనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.. సాంప్రదాయ తెలుగు స్వీట్లు, అపెటైజర్లు, సకినాలు, ఊరగాయలు, పొడులు, పులిహోర, పనసపట్టు పలావ్, పెరుగు అన్నం, గుత్తి వంకాయ, ఉలవచారు, రాగి సంకటి, ముద్ద పప్పు, దప్పళం, వడియాలు మరియు కిళ్లీ (పాన్) ఇతర వంటకాలను వడ్డించారు. బిర్యానీ జంక్షన్ నుండి వచ్చిన రుచికరమైన భోజనాన్ని మరియు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా తెప్పించిన స్వీట్లు, స్నాక్స్‌ను అతిథులు ఆస్వాదించారు. బాటా బృంద సభ్యులు స్వయంగా అతిథులందరికీ వడ్డించి, 5 దశాబ్దాలకు పైగా తమకు అందిస్తున్న మద్దతుకు కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకల్లోనే అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) కూడా భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి మరియు పలువురు స్థానిక ఎన్నికైన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై, భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు మరియు నృత్య కార్యక్రమాలను అతిథులు ఆస్వాదించారు. అధికారులు హాజరైన వారందరికీ సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, పండుగను నిర్వహించినందుకు ఎఐఎ, బాటా బృందాలను అభినందించారు.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు “భోగి పళ్లు” కార్యక్రమం వైభవంగా జరిగింది. పిల్లలు, తల్లిదండ్రులు మరియు తాతయ్యలు, నానమ్మలు పాడిన భక్తి గీతాలు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం పెద్ద కుటుంబ కలయికలా – “వసుదైవకుటుంబం”లా కనిపించింది. పెద్దలు పిల్లలందరినీ ఆశీర్వదించారు. తానా, బాటా ఆధ్వర్యంలో ఆమెరికాలోని చిన్నారులకు తెలుగుభాషను నేర్పిస్తున్న “పాఠశాల” తెలుగు విద్యార్థులు స్కిట్లు, ఇతర కార్యక్రమాలను ప్రదర్శి తెలుగు భాష నేర్చుకోవడానికి పిల్లలు చూపిస్తున్న ఉత్సాహాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. బాటా కరవోకే టీమ్ లోని గాయకులు “పాటల పల్లకి” పేరుతో మధురమైన సూపర్ హిట్ పాటలను ఆలపించారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని పలు పోటీలను ఏర్పాటు చేశారు. పెద్దలకు వంటల పోటీలు (సూపర్ చెఫ్), పిల్లలకు (లిటిల్ చెఫ్), రంగుల రంగవల్లి పోటీ, చిత్రలేఖన పోటీ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పిల్లలు ఇంటి నుండి కావలసిన పదార్థాలను తెచ్చుకుని, తల్లిదండ్రుల సహాయం లేకుండా తమకు నచ్చిన వంటకాన్ని అక్కడికక్కడే తయారు చేశారు. పిల్లలు తమ వంట నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూపర్ చెఫ్ పోటీలో పురుషులు మరియు మహిళలు తమ వంట ప్రతిభను చూపించారు. రంగవల్లులు చూడటానికి కనులవిందుగా కనిపించింది. భారతదేశంలోని పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. ఎఐఎ ఐడల్ (గాన పోటీ)కి అద్భుతమైన స్పందన లభించింది. దీనిని ఈస్ట్ బే కచేరీ (ఇబికె) బాటా, ఎఐఎ కచేరీ బృందాలు నిర్వహించాయి. చిన్న పిల్లలు మరియు యువతీ యువకులు టాలీవుడ్ నుండి వచ్చిన సరికొత్త సూపర్ హిట్ పాటలకు ఉత్సాహభరితమైన, ఉర్రూతలూగించే నృత్యాలు చేశారు. ఈ వేడుకల కోసం బాటా టీమ్ శాన్ హోసె, కుపర్టినో, ఫ్రీమాంట్, శాన్ రామన్ వంటి వివిధ ప్రదేశాలలోని చిన్న పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. అత్యంత ప్రజాదరణ పొందిన అన్ని నృత్య గీతాలను ప్రదర్శించారు. “నాన్న పిల్లలు” ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
ఈ వేడుకలకు వాణిజ్య, వ్యాపార సంస్థల నుండి భారీ మద్దతు లభించింది. సంజీవ్ గుప్తా, సిపిఎ గ్రాండ్ స్పాన్సర్‌గా, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య “పవర్డ్ బై”స్పాన్సర్‌గా, “శ్రీని గోలి రియల్ ఎస్టేట్స”గోల్డ్ స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఇతర స్పాన్సర్లలో ఇన్‌స్టా సర్వీస్, పిఎన్జి జ్యువెలర్స్, అపెక్స్ కన్సల్టింగ్, ఎర్త్ క్లెన్స్, కావ్య ఫుడ్స్ ఉన్నాయి.
బాటా అధ్యక్షుడు శివ కె. వాలంటీర్లందరికీ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అతను బాటా కార్యనిర్వాహక కమిటీలో ఉన్న వరుణ్, హరి ఎస్, సందీప్ కె సంకేత్ లను పరిచయం చేశారు.
సాంస్కృతిక కమిటీలో శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల, తారక దీప్తి, కిరణ్ విన్నకోట ఉన్నారు.
లాజిస్టిక్స్ బృందంలో సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఇనాంపుడి, సుధాకర్ బైరి ఉన్నారు.
యూత్ కమిటీ – ఉదయ్, గౌతమి, సింధు.
ఆర్ట్- డిజైన్ కమిటీ సభ్యులు కళ్యాణి, కృష్ణ ప్రియ, దీప్తి, శ్రవంతి.
స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కమేష్ మల్ల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి.
బాటా “సలహా సంఘం”- జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి ఈ వేడుకలను గ్రాండ్‌గా విజయవంతం చేసిన టీమ్ కు అభినందనలు తెలిపారు.






