Guna Sekhar: మినిస్టర్ల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్(Guna Sekhar) దర్శకత్వంలో 2010లో వచ్చిన వరుడు(Varudu) సినిమాకు రిలీజ్ కు ముందు ఎంత హైప్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో నటించే హీరోయిన్ ను రిలీజ్ ముందు వరకు కూడా రివీల్ చేయకపోవడంతో ఆ హీరోయిన్ ఎవరా అని తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఈ విషయంపై తాజాగా గుణశేఖర్ మాట్లాడారు.
వరుడు మూవీలో హీరో ఎలాగైతే హీరోయిన్ ను పెళ్లి పీటల మీదనే మొదటి సారి చూస్తాడో, అలానే ఆడియన్స్ కూడా డైరెక్ట్ గా థియేటర్లలోనే చూస్తే బావుంటుందనే ఐడియా వచ్చిందని, ఆ ఐడియా వల్ల సినిమాకు ఊహించని క్రేజ్ వచ్చిందని, దీంతో సినిమాకు ఇది మంచి ప్లస్ పాయింట్ అవుతుందనుకున్నానని, కానీ రిలీజ్ తర్వాత భానుశ్రీ మెహతా(Bhanusri mehatha)ను చూసి ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారని గుణశేఖర్ చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భానుశ్రీ చూడ్డానికి బావున్నప్పటికీ ఆ హైప్ కు సరిపోలేదేని, అందుకే ఆడియన్స్ నిరాశ చెందారని, సినిమా రిలీజ్ కు ముందు ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని మినిస్టర్లు, వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా తనకు విపరీతమైన ఫోన్లు వచ్చాయని, కొందరైతే ఆ అమ్మాయి కమల్ హాసన్(kamal hassan కూతురే కదా అని కూడా అన్నారని చెప్పారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన యుఫోరియా(Euphoria) ఫిబ్రవరి 6న రిలీజవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో గుణశేఖర్ పలు విషయాలను మాట్లాడుతూ, వరుడు గురించి కూడా ప్రస్తావించారు.






