Varanasi: వారణాసి రిలీజ్ డేట్ పై లీక్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వారణాసి(Varanasi) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(priyanka chopra) హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) విలన్ గా నటించనున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలున్నాయి.
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే ప్రపంచమంతటి దృష్టి ఉంది. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసి దాంతో సోషల్ మీడియాను షేక్ చేశాడు జక్కన్న. వారణాసి గ్లింప్స్ తర్వాత నుంచి చిత్ర యూనిట్ నుంచి మరో అప్డేట్ వచ్చింది లేదు.
అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దానికి కారణం ఆఫ్లైన్ లో ఓ హోర్డింగ్. ఈ హోర్డింగ్ లో వారణాసి రిలీజ్ డేట్ ఏప్రిల్7, 2026 అని ఉంది. దీంతో వరల్డ్ సినిమా వద్ద వారణాసి పేరు మరోసారి మార్మోగిపోతుంది. అయితే ఇది నిజమా లేదా కావాలని ఏదైనా లీక్ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వారణాసికి ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేసే పనిలేకుండానే విపరీతమైన క్రేజ్, హైప్ వస్తున్నాయి.






