KCR: కేసీఆర్ తర్వాత సినిమా వాళ్ళకే..?
తెలంగాణా రాజకీయాల్లో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్ రావులను విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు ఏకంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. దీనితో గులాబీ పార్టీలో కొత్త గుబులు మొదలైంది. అయితే అధికారులు ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ నుంచి రిప్లై వెళ్ళింది. తాను మున్సిపల్ ఎన్నికలతో(Muncipal election) తీరిక లేకుండా గడపడంతో విచారణకు సహకరించలేను అంటూ కేసీఆర్ ఓ లేఖ రాసారు.
ఈ నోటీసులను కెటిఆర్ తప్పుబడితే.. కవిత విచారణకు హాజరు కావాలన్నారు. అయితే సిట్ అధికారులు మాత్రం గులాబీ బాస్ ను వదలడం లేదు. నేడు కుదరకపోతే రేపు రండి అంటూ వెంట పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుతో ఇప్పుడు ఎర్రవెల్లిలో టెన్షన్ మొదలైంది. కేసీఆర్కు మరోసారి నోటీసు ఇచ్చేందుకు సిట్ అధికారులు రెడీ అయ్యారు. ఇవాళ విచారణకు రావాలని నిన్న కేసీఆర్కు నోటీసు ఇచ్చిన సిట్.. నిన్న పొద్దుపోయిన తర్వాత కేసీఆర్ రిప్లై ఇవ్వడంతో సిట్ మళ్ళీ నోటీసులు రెడీ చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
డేట్ మార్చి.. అదే మేటర్ తో రండి మాట్లాడుకుందాం అంటూ ఆహ్వానించింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి తేదీ అవడంతో విచారణకు సమయం కావాలని కేసీఆర్ లేఖ రాయడంతో రేపు రమ్మని చెప్పనుంది. అయితే కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇక కేసీఆర్ తర్వాత సినిమా వాళ్లకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సినీ నటులు బాధితులు అనే విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు వాళ్ళను పిలవాలని ఆ తర్వాత వ్యాపార ప్రముఖులకు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.






