Amaravati: అమరావతికి అరుదైన అవకాశం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati) నగర నిర్మాణం ఒక అరుదైన అవకాశమని ఆర్థిక సర్వే పేర్కొంది. సులభతర జీవనానికి ఇది భవిష్యత్ నగరంగా నిలుస్తుందని తెలిపింది. ఒక నగరం కిక్కిరిసిపోయాక, సేవల కొరత ఏర్పడ్డాక, అనధికార నిర్మాణాలు పెరిగాక మార్పులు, చేర్పులు చేయడం కంటే, గ్రీన్ఫీల్డ్ నగరం ఏర్పాటు ద్వారా అక్కడి జీవన వ్యవస్థని ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. భారీ మౌలిక సౌకర్యాలపై ఆధారపడే నగరాలకంటే విద్య (Education), ఇతర రంగాల అనుసంధానంతో ఏర్పడే నగరాలే వేగంగా వద్ధి చెందుతాయని స్పష్టం చేసింది. కొత్త నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్లో అభివద్ధి చెందుతున్న అమరావతిని అందుకు ఉదాహరణగా ఆర్థిక సర్వే పేర్కొంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






