Minister Savita: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్తు (Free electricity) అందించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత (Minister Savita) వెల్లడించారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 1.03 లక్షల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.85 కోట్లు ఖర్చవుతుందని వివరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్(Jagan) అని మండిపడ్డారు. కుట్రపూరిత ఆలోచనతోనే శ్రీవారి లడ్డూ (Sri Vari Laddu) ప్రసాదాన్ని కల్తీ చేయించారన్నారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సిట్ స్పష్టం చేసిందన్నారు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి జగన్ బ్యాచ్ బుకాయిస్తోందని మండిపడ్డారు.






