Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 3న ఆలయం మూసివేత
చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 9నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ తర్వాత ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచణ క్రతువులు పూర్తి చేస్తారు. రాత్రి 8:30 నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.ఆ రోజు వీఐపీ బ్రేక్ (VIP break,), శ్రీవాణి (Srivani) సహా అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను, అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ (TTD) రద్దు చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






